లవ్ ఎఫైర్స్ పై సంచలన కామెంట్స్ చేసిన రష్మిక...

Purushottham Vinay
 
 
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే ఫ్లో లో నితిన్ తో చేసిన భీష్మ సినిమాతో కూడా హిట్ కొట్టింది. ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాలు చూసినట్లయితే ఈ టాలీవుడ్ లక్కీ లేడీ రష్మిక మందన లవ్ ఎఫైర్స్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సుదీర్ఘ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. రష్మికను ఓ ఫ్యాన్ మీరు సింగిలేనా అని అడిగారు. దానికి సమాధానంగా రష్మిక అవును నేను సింగిల్ గానే ఉన్నారు. సింగిల్ గా ఉండడం వలన జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే సింగిల్ లైఫ్ వలన మనకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుస్తుంది. ఐతే సింగిల్ స్టేటస్ వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

ఎవరితోనూ రిలేషన్ లో లేమని తెలిస్తే ఎవరో ఒకరితో లింకులు పెడుతూ కథనాలు రాస్తూ ఉంటారు. కావున నాకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని రాయకండి ప్లీజ్ అని రష్మిక వేడుకోవడం జరిగింది. ఎవరితో ఒకరితో ప్రేమలో ఉన్నామని తెలిస్తే వారి గురించే రాస్తారు, అలా లేని పక్షంలో అనేక మందితో లింకులు పెట్టి రోజుకో కథనం రాస్తారని రష్మిక పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇక రష్మిక లవ్ ఎఫైర్స్ గురించి మాట్లాడుకోవాలంటే, కెరీర్ బిగినింగ్ లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో ఈమె పడిపోయింది.

 పెళ్ళికి సిద్దమైన ఈ జంట నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పెళ్ళికి ముందే విడిపోయారు. ఆ తరువాత టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు రష్మికకు మధ్య సంథింగ్ సంథింగ్ అని పుకార్లు రావడం జరిగింది.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: