బిగ్ బాస్ 4 : కెప్టెన్ గా కుమార్ సాయి.. అసలాట ఇప్పుడే మొదలైంది..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో నాలుగవ కెప్టెన్ ఇంటి కెప్టెన్ గా కుమార్ సాయి విన్ అయ్యాడు. మూడు రోజులుగా జరుగుతున్న కిల్లర్ కాయిన్ టాస్క్ లో అనూహ్య పరిణామాల మధ్య ఫైనల్ రౌండ్ లో కుమార్ సాయి కాయిన్ వాల్యూస్ ఎక్కువ ఉండటంతో కుమార్ సాయి కెప్టెన్సీ వరించింది. కెప్టెన్సీ ఫైనల్ రౌండ్ లో అమ్మా రాజశేఖర్, హారిక, కుమార్ సాయి, సుజాత పాల్గొన్నారు. ఫైనల్ రౌండ్ లో మడ్ పిట్ లో ఉన్న కాయిన్స్ ను ఏరుకుని వారివారి బుట్టలో వేయాల్సి ఉంటుంది.

ఈ రౌండ్ లో కుమార్ సాయికి ఎక్కువ కాయిన్స్ రావడంతో ఈ వారం కెప్టెన్ గా కుమార్ సాయి ఎంపికయ్యాడు. కెప్టెన్ గా ఉండటంతో నామినేషన్స్ నుండి తప్పించుకోవచ్చు. అంతేకాదు కెప్టెన్ గా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటి వారం తర్వాత హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన కుమార్ సాయి రెండు వారాలుగా నామినేషన్స్ లో ఉంటున్నాడు. ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నాడు కుమార్ సాయి.

ఈ వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయితే మళ్ళీ హౌజ్ కెప్టెన్ గా వేరే వారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇక ఈ వారం కుమార్ సాయి సేఫ్ అయితే మాత్రం అసలు ఆట మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. హౌజ్ లో ఇప్పటివరకు వెనకపడ్డ కుమార్ సాయి కెప్టెన్ గా మారాడు కాబట్టి ఇక మీదట యాక్టివ్ గా ఉండే ఛాన్స్ ఉంది. మరి కుమార్ సాయి కెప్టెన్ అయ్యాక ఆటలో మార్పు వస్తుందా.. ఇక మీదట తన అసలు ఆట మొదలుపెడతాడా అన్నది చూడాలి.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: