అలాంటి సీన్స్ లో కాజల్ అంటే అబ్బో అరుపులే..!
ముఖ్యంగా ఇప్పుడు మారిన ఆడియెన్స్ ఆలోచన ధోరణికి తగినట్టుగా కాజల్ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఓ క్రేజీ వెబ్ సీరీస్ లో నటిస్తుంది అమ్మడు. హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా చేసిన క్వాంటికో సీరీస్ ఇండియన్ ఫార్మెట్ లో ఈ వెబ్ సీరీస్ ఉంటుందట. ఈ వెబ్ సీరీస్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది. అయితే ప్రియాంకా కాబట్టి హాట్ లిప్ లాక్స్, బెడ్ సీన్స్ చేసింది.. మరి కాజల్ అలా చేస్తే ఇంకేమైనా ఉందా.. అరుపులు కేకలే. కాజల్ ఆ రేంజ్ లో రెచ్చిపోతే మాత్రం రచ్చ రంభోలా అని చెప్పొచ్చు.
ప్రస్తుతం కాజల్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత భారతీయుడు 2 లో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు కాజల్ ను మరో ఐదారేళ్ళు కెరియర్ కొనసాగించేలా ఉన్నాయి. మరో పక్క వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతుంది కాబట్టి కాజల్ కెరియర్ కు ఢోకా ఉండదని చెప్పొచ్చు. మరి కాజల్ చేస్తున్న ఈ అటెంప్ట్ ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.