అసక్తికరంగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం...!
ప్రపంచం లోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఈ 'మోసగాళ్లు'. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మోసగాళ్లు టీజర్‌ను శనివారం అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసినదే. మంచు విష్ణు, కాజల్ ఇందులో మోసగాళ్లుగా కనిపించనున్నట్లు సమాచారం. మోసగాళ్లు' చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అలానే ఈ టీజర్ లోని ఓ సన్నివేశం కూడా ఎంతో ఆసక్తిగా మారింది. డబ్బు కట్టలు చూపిస్తూ.. ఇది సరి పోతుందిగా అని కాజల్ మంచు విష్ణు ని అడుగుతుంది. దానికి సమాధానం మంచు విష్ణు ఇలా అంటాడు.... 'ఆట ఇప్పుడే మొదలైంది' అని. ఈ డైలాగ్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలానే ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీస్ అధికారి పాత్ర లో కనిపించనున్నారు. అంతే కాకుండా హీరో నవదీప్ కూడా ముఖ్యమైన పాత్ర చేయనున్నాడు. మరి ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు.