ఆ సినిమా రీమేక్ లో ఈ ఇద్దరేనా..?
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ గురించి టాలీవుడ్ మాట్లాడుకుంటోంది. తెలుగు రీమేక్ రైట్స్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ దగ్గర ఉన్నాయి. అయ్యప్పనుమ్ గా బిజుమీనన్, కోషీగా పృథ్విరాజ్ నటించారు. ఇద్దరూ.. ఇద్దరే.. పవర్ ఫుల్ రోల్స్ ఈ ఇద్దరి మధ్య ఇగో క్లాష్.. ఒకరంటే ఒకరికి పడదు. ఎవరిని ఎవరు దెబ్బ తీద్దామా అని కాజుకు కూర్చుంటారు. ఈ క్రమంలో కథా కథనం ఆసక్తికరంగా సాగుతుంది. రీమేక్ లో ఢీ అంటే ఢీ అనే ఇద్దరు హీరోలు కావాలి. కానీ వాళ్లే కనిపించడం లేదు.
సినిమాలో అయ్యప్పనుమ్ మొరటు పోలీసు. మంచి వాడే కానీ.. ఈగో ఆ మంచితనాన్ని డామినేట్ చేస్తుంది. ఇలాంటి రోల్ ను తెలుగులో ఎవరు పోషిస్తారనేది పెద్ద ప్రశ్న. మొరటోడు అంటే రాజశేఖర్ గుర్తుకు వచ్చినా.. యాంగ్రీ యంగ్ మెన్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. గరుడ వేగలో కాళ్లు చేతులు బిగించడంతో మునుపటి ఎనర్జీ కనిపంచలేదు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ రైట్స్ కొన్న వెంటనే వినిపించిన పేరు బాలకృష్ణ. లక్ష్మీ నరసింహా, రౌడీ ఇన్ స్పెక్టర్ లో రఫ్ పోలీస్ గా కనిపించి.. మెప్పించిన బాలకృష్ణ అయితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగింది.
అయ్యప్పనుమ్ రోల్ స్టార్స్ చుట్టూనే తిరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో తిస్తారనేది లేటెస్ట్ న్యూస్. తిక్కుంది.. లెక్కుందంటూ హీరోయిజం చూపించిన గబ్బర్ సింగ్ అయ్యప్పనుమ్ రోల్ పోషిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు నిర్మాత. పెర్పామెన్స్ రోల్స్ దక్కని పవన్ కు అయ్యప్పనుమ్ పాత్ర మంచి ఛాయిస్. అయ్యప్పనుమ్ తో పాటు కొషి పాత్ర కూడా ఇంపార్టెంటే. తనను చెంపదెబ్బ కొట్టిన అయ్యప్పనుమ్ ను ఇరుకున పెట్టే కంత్రీ ఆలోచన కొషిది. ఇలాంటి మరో ఇగోయిస్ట్ రోల్ రానా చుట్టూ తిరుగుతోంది.