ఎంతో నమ్మి అవకాశం ఇచ్చిన ఆ ఇద్దరు ముంచారు ... మరి ఈయనకు ఇస్తే ఏమి చేస్తాడో ఏమో ......??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్. జె. సూర్య దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా నాని. 2004లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది/ మహేష్ సరసన తొలిసారిగా అమీషా పటేల్ జతకట్టిన ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించగా రఘువరన్, ఐశ్వర్య, సునీల్, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వాస్తవానికి అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎస్. జె. సూర్య తీసిన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
దానితో నాని సినిమా పై ప్రేక్షకులు, మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ కెరీర్ కొంత ఇబ్బందుల్లో పడింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన మహేష్ ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో నటించిన సినిమా స్పైడర్. అంతకు ముందు తమిళంలో విజయ్ తో తుపాకీ, కత్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మురుగదాస్ తొలిసారిగా మహేష్ తో స్పైడర్ మూవీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. కాగా అలా ఈ క్రేజీ సినిమాపై ప్రేక్షకుల అభిమానుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విధంగా అటు ఎస్.జె.సూర్య ఇటు మురుగదాస్ ఇద్దరు టాలీవుడ్ దర్శకులు మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక ఆయనకు పరాజయాల అందించారు.
ఇటీవల లేటెస్ట్ గా కొన్ని రోజులుగా పలు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి అతి త్వరలో కార్తీతో ఖైదీ మూవీ తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయనున్నట్లు టాక్. అయితే ఇప్పటికే ఇద్దరు కోలీవుడ్ దర్శకులకు అవకాశం ఇచ్చి ఇబ్బందుల్లో పడ్డ మహేష్ బాబు మరొకసారి ఆ యువ దర్శకుడికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారో అన్న భయం  మాకు కొంత కలుగుతోందని అందుకే అవకాశం ఉన్నంత వరకు ఆయనతో సినిమా వద్దే వద్దు అంటూ పలువురు మహేష్ ఫ్యాన్స్ తమ హీరోని కోరుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: