అదిరింది.. బొమ్మ అదిరింది.. ఈటివి ఫాలో అవుతున్న జీ తెలుగు..?

shami
ఈటివి కామెడీ షో ఫార్మెట్ ను క్రాస్ చేయాలని మిగతా ఛానెల్స్ తెగ ప్రయత్నిస్తున్నాయి. కాని అది కుదరడం లేదు. ఈటివిలో వచ్చే జబర్దస్త్, ఎక్స్ ట్రీ జబర్దస్త్ ల షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిలో చేసిన అందరికి సూపర్ క్రేజ్ తెచ్చింది. అయితే జబర్దస్త్ నుండి ఆ షో డైరక్టర్స్ ఇద్దరు బయటకు వచ్చారు. వారికి జీ తెలుగు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నాగబాబు కూడా సపోర్ట్ చేయడంతో అదిరింది అంటూ మొదలుపెట్టారు.  

ఆ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. జబర్దస్త్ లో ఇదివరకు చేసిన వేణు, ధన్ రాజ్ లు అక్కడ టీం లీడర్స్ గా చేస్తున్నారు. ఇక ఇక్కడ నుండి చమ్మక్ చంద్ర బయటకు వచ్చేసి అదిరిందిలో జాయిన్ అయ్యాడు. గల్లీ బోయ్స్ అని పటాస్ లో టాలెంట్ చూపించిన కొందరికి ఛాన్స్ ఇచ్చారు. అయితే అదిరింది షో లైన్ లో సక్సెస్ అవగా ఇప్పుడు బొమ్మ అదిరింది అని కొత్త షో మొదలుపెట్టారు.

అదిరింది.. బొమ్మ అదిరింది షోలను చూస్తుంటే.. ఇది పక్కా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫార్ములాతోనే వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్ళిన శ్రీముఖి ఆ షో అయ్యాక ఈటివి పటాస్ చేయలేదు. ఇక మరోపక్క స్టార్ మా కొన్ని షోస్ చేసింది. అయితే అనసూయ, రష్మిల్లా పర్మినెంట్ షో కావాలని చూస్తున్న శ్రీముఖికి జీ తెలుగు మంచి ఆఫర్ ఇచ్చింది. బొమ్మ అదిరిందిలో శ్రీముఖి యాంకర్ గా చేస్తుందని తెలుస్తుంది. ప్రోమో ఎపిసోడ్ లో సుమ కూడా కనిపించింది. నాగబాబు, జానీ మాస్టర్ ఇలా అందరు బొమ్మ అదిరింది షోలో ఉంటున్నారని తెలుస్తుంది. మరి అదిరింది.. బొమ్మ అదిరింది ఇవి ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాయో చూడాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: