మరో స్టార్ హీరోయిన్ కూతురు తెరంగేట్రం....
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితాసేన్ తన పెంపుడు కూతురు రెనీ సేన్ ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 21 ఏళ్ల రేని సేన్ మొదటి సినిమా ప్రారంభం అయ్యింది. సుత్తబాజీ అనే సినిమాతో రెనీ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో రెనీకి అమ్మగా కోమల్ చబ్రియా నటిస్తున్నారని అలాగే రాహుల్ వోహ్రా నాన్న పాత్రలో కనిపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది. ఇది ఒక పరిపూర్ణమైన తండ్రి కూతుళ్ళ మధ్యన జరిగే ఒక ఎమోషనల్ డ్రామా గా తెరెకెక్కనుందట.
అయితే కరోనా కారణంగా వస్తున్న సినిమాలన్నీ డిజిటల్ రంగంలోనే విడుదలవుతున్నాయి కాబట్టి ఈ సినిమాను కూడా అందులోనే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ సినిమాను నిన్నటి నుండి షూటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు సుష్మిత తన కూతురును ప్రేక్షకులకు పరిచయం చేబోతుంది. ఈ మధ్యనే నెపొటిజం గురించి విమర్శలు వస్తున్నా కూడా అవేమి పట్టించుకోకుండా తమ పిల్లలను పరిచయం చేస్తూనే ఉన్నారు.
కాగా "ఆర్య" తో ఓటీటీలో ఇటీవలే సుష్మిత సేన్ ఎంటర్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు కూతురు ను కూడా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సుత్తబాజీ సినిమా సక్సెస్ అయితే ఆమెకు ఫీచర్ ఫిల్మ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వారసులుగా ఉన్నప్పటికీ టాలెంట్ ఉంటేనే ఈ రంగంలో సక్సెస్ అవుతారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈమెకు ఏది కలిసొస్తుందో చూద్దాం.