బిగ్ బాస్ లో ఆ బ్యూటీ ఎఫైర్ బయటపడుతుందని ఏడ్చిందా.. నెటిజన్స్ ఫైర్

Satvika
తెలుగు బిగ్ బాస్ లో ప్రస్తుతం రచ్చలు జరుగుతున్నాయి. మొదట్లో రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళే ఇప్పుడు నువ్వా నేనా అంటూ మాటల యుద్దానికి రెడీ అవుతున్నారు. ఎలిమినేషన్ కు నామినేషన్ మొదలైందంటే చాలు ఒకరినొకరు తిట్లతో దూషించుకుంటారు..నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో లో సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, టీవీ 9 యాంకర్ దేవి ,స్వాతి దీక్షిత్ లు ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఇప్పుడు ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.


గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ లో జరిగిన రూమర్స్, గుసగుసలను మనసులో పెట్టుకొని సోమవారం జరుగుతున్న నామినేషన్ లో బయటపెడుతున్నారు. ఇప్పుడు ఇంటిలో ఉన్న వాళ్లంతా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే..అయితే వీరి లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. నిన్న ఎపిసోడ్ లో నాగ్ ఇచ్చిన కౌంటర్ కు రొమాన్స్ ను కట్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందరూ గేమ్ మీద ఫోకస్ పెట్టారు. ఇకపోతే ఈరోజు జరిగిన ఎపిసోడ్ కాస్త రసవత్తరంగా జరిగింది.

ఇంటి సభ్యులు ఉదయం ఫుల్ జోష్ తో  ఇరగ ఇరగ పాటకు స్టెప్పులు వేసిన వాళ్లంతా కొద్ది సేపటి తరువాత రచ్చ చేశారు. నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై నురగను పూయాలని.. ఎందుకు పూసారో అన్నది చెప్పాలని బిగ్ బాస్ తెలిపారు.నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించారు బిగ్ బాస్. అలా ఒకరికొకరు నురగ పూసి కారణాన్ని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ ఎపిసోడ్ లో మాత్రం మోనాల్ కు ఎక్కువ మంది పూయడంతో ఎమోషనల్ అయ్యింది.



నన్ను ఎందుకు టార్గెట్ చేశారు అంటూ ఏడ్చేసింది. ఆమె అంతగా ఎందుకు ఏడ్చిందో ఎవరికీ అర్థం కాలేదు..ఎఫైర్ బయట పడిందని ఏడ్చిందా లేక ఇంకేదైనా ఉందా అనేది  మిస్టరీగానే మిగిలిపోయింది. మోనాల్ ఇలా అయిందానికి కానీ దానికి కంటతడి పెట్టుకుంటే బిగ్ బాస్ లో ఉండటం కష్టమని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మోనాల్ అని నెటిజన్లు గట్టిగా చెబుతున్నారు.మరి ఎవరు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తారో తెలియాలంటే బిగ్ బాస్ ను తప్పక చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: