400 మిలియన్స్.. ఇది బుట్టబొమ్మకు మాత్రమే సాధ్యమైన రికార్డ్..!

shami
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. ఈ సినిమాకు థమన్ అందించిన సాంగ్స్ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. సినిమాకు సాంగ్స్ ఎంత పెద్ద అసెట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదిలాఉంటే అల వైకుంఠపురములోని బుట్ట బొమ్మ సాంగ్ మిలియన్ల రికార్డ్ సృష్టిస్తుంది. 100, 200, 300 మిలియన్స్ దాటుకుని ఇప్పుడు 400 మిలియన్స్ వ్యూస్ అందుకుని సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది బన్నీ సాంగ్.
బుట్ట బొమ్మ సాంగ్ లో అల్లు అర్జున్, పూజా హెగ్దే ఇద్దరి స్టైలిష్ లుక్ అదిరిపోతుంది. ఇక సాంగ్ లో పూజా హెగ్దే నిజంగానే బుట్ట బొమ్మగా కనిపిస్తుంది. సినిమాలో పూజా గ్లామర్ షో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు. సినిమా వసూళ్ల రికార్డులే కాదు సాంగ్ తో కూడా వందల మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది.
ఈ ఇయర్ మొదట్లో రిలీజైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అటు బన్నీ కెరియర్ లోనే కాదు త్రివిక్రం కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి బన్నీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అంతకుముందు రంగస్థలం మీద ఉన్న అన్ని రికార్డులను బన్నీ అల వైకుంఠపురములో సినిమా తిరగరాసింది. బుట్ట బొమ్మ సాంగ్ సాధించిన ఈ రికార్డ్ కు హారిక హాసిని ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అల్లు ఫ్యాన్స్ ఇది చూసి తెగ సంబరపడుతున్నారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: