బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు మరో మలుపు తిరుగుతుంది.ఈ కేసులో ప్రముఖ ముద్దాయిగా నటి రియా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఎన్నో విషయాలు బయట పడ్డాయి..బాలీవుడ్ లో జోరుగా సాగుతున్న డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది..అంతేకాదు బాలీవుడ్ లోని చాలా మంది డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. విచారణ లో రియా బయట పెట్టిన కొందరి ప్రముఖుల పేర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ వ్యవహారంతో చిక్కుల్లో పడిన నటి రియా చక్రవర్తి కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరించిందనే ఆరోపణలు రావడంతో రియాను సెప్టెంబర్ 9న పోలీసులు అరెస్ట్ చేశారు. రియా ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు..అనే ఇచ్చిన వివరాల మేరకు కొందరు ప్రముఖుల నటీమణులు పేర్లు బయటకు వచ్చాయి.దీంతో పోలీస్ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా రియా కస్టడీ గడువును పొడిగిస్తున్నట్లు కోర్టు నిర్ణయించింది..ఈ నేపథ్యంలో రియా కస్టడీని అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముంబయి సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ రియా చక్రవర్తి సెప్టెంబర్‌లోనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు తన సోదరుడు, కొందరు వ్యక్తులు ఆమె బెయిల్ పై పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఈ మేరకు అనేక సార్లు చర్చలు జరిపారు. తాజాగా ఆమె డ్రగ్స్ సరఫరా చేశారన్న దానిపై నిజనిర్ధారణకు వచ్చేవరకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. దీనిపై బుధవారం న్యాయస్థానం మరో సారి విచారణ చేపట్టేందుకు సిద్దంగా ఉందని తెలుస్తుంది. మొత్తానికి రియా ఇప్పటిలో బయటకు రాదని అర్థమవుతుంది..