హాలీవుడ్ స్టార్ నటుడు దారుణ హత్య...?
ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని మరియు చుట్టు పక్కల వారిని హత్య గురించి ఆరా తీయగా.. ఏమీ తెలియదు అన్నట్లుగా స్పందించారు. ఒక్కరూ అసలు నిజాన్ని బయట పెట్టలేదు. థామస్ ని వెనుక నుండి తుపాకీతో కాల్చారు. దుండగులు వెనుక నుండి రావడం వల్ల థామస్ గుర్తించలేదని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లెట్ గాయాలకు ఆయన అక్కడికి అక్కడే దారుణంగా మరణించాడు. థామస్ కలుపుగోలు వ్యక్తి.. అందరితో సరదాగా, సన్నిహితంగానే ఉంటాడు. ఎవరితో కూడా గొడవలు పెట్టుకునే మనస్థత్వం కాదు. అయితే హత్య జరిగిన... అదే రోజు ఒక దుకాణంలో షాప్ కీపర్ కు అతడికి చిన్న గొడవ జరిగిందట.
ఆ గొడవ వల్లే థామస్ చంపబడ్డాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అట్లాంటాకు చెందిన ఈ సీనియర్ అగ్ర నటుడు ఉన్నత విధ్యను అభ్యసించి నటుడిగా పరిచయం అయ్యాడు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని... పేరుప్రఖ్యాతులు గాంచిన థామస్ ఇలా మృతి చెందడం పట్ల హాలీవుడ్ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తూ.... వీలైనంత త్వరగా హంతకులను పట్టుకొని కఠిన శిక్షలు విధించాలంటూ కోరుకుంటున్నారు.