కాజల్ పెళ్ళని తెలిసి దేవదాసులా మారిన తెలుగు హీరో..!

shami
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్ళి వార్తతో అందరికి షాక్ ఇచ్చింది. కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతం కిచ్లుతో పెళ్ళికి రెడీ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయ్యాక ఈ నెల 30న తన పెళ్ళి అంటూ సర్ ప్రైజ్ చేసింది అమ్మడు. టాలీవుడ్ చందమామ పెళ్ళి వార్త విని ఆడియెన్స్ మాత్రమే కాదు ఓ తెలుగు హీరో కూడా డిస్ట్రబ్ అయినట్టు ఉన్నాడు. అందుకే గెడ్డం పెంచి దేవదాసులా మారాడు. ఇంతకీ కాజల్ పెళ్లితో దేవదాసుగా మారిన ఆ హీరో ఎవరంటే బెల్లంకొండ శ్రీనివాస్ అని తెలుస్తుంది.  

కాజల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ కవచం, సీత సినిమాలు చేశాడు. ఈ సినిమా టైం లో ఇద్దరు బాగా క్లోజ్ అయినట్టు టాక్. అంతేకాదు కాజల్, బెల్లంకొండ శ్రీను ఇద్దరు సోషల్ బ్లాగుల్లో చాటింగ్ కూడా ఫ్యాన్స్ కు తెలిసిందే. సీనియర్ హీరోయిన్ మోజులో పడ్డ యువ హీరో అని వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కాజల్ పెళ్లి వార్త విని కంగ్రాట్స్ బ్రో అని గౌతం కిచ్లుకి చెప్పిన బెల్లంకొండ బాబు తన కొత్త దేవదాస్ లుక్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న బెల్లంకొండ బాబు ఈమధ్య కొద్దిగా గడ్డం పెంచి ఫోటోలు దిగాడు. అయితే ఈ ఫోటోలు పట్టుకుని కాజల్ పెళ్ళి ఫిక్స్ అవడం వల్లే బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా దేవదాసులా మారిపోయాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కాజల్ పెళ్ళి చేసుకుంటున్న ఇలాంటి టైం లో ఇలాంటి గాసిప్స్ ఆమెను ఇబ్బందుల్లో పడేస్తాయి. కాజల్ కొన్నాళ్లుగా గౌతం తోనే క్లోజ్ గా ఉంటూ వచ్చింది. అతన్ని పెళ్ళి చేసుకునేందుకే గౌతం తో క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: