ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు అదిరిపోయే టైటిల్..!
అంతేకాదు సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు. దీపిక, అమితాబ్ ఇద్దరు సినిమాలో చేస్తున్నారని తెలిసి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమాకు టైటిల్ గా అమితాబ్ పేరుని పెడుతున్నట్టు తెలుస్తుంది. సినిమా టైటిల్ గా బిగ్ బి అని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్.
సినిమా కథకు బిగ్ బి అన్నది పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నాడట డైరక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెర్గుతుందని తెలుస్తుంది. రాధే శ్యామ్, ఆదిపురుష్ ఈ రెండు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్ సినిమాల లిస్ట్ చూసి బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అవుతున్నారు. పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తో ప్రభాస్ అదరగొడుతున్నాడని చెప్పొచ్చు.