మెహబూబ్ కు బాగా కోటింగ్ ఇచ్చిన నాగార్జున..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో ఈ శనివారం హాట్ హాట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సీజన్ 4 స్టార్ట్ అయ్యి ఐదు వారాలు అవుతుండగా ఈ వారం ఫైర్ అయినట్టుగా నాగార్జున ఎప్పుడు ఫైర్ అవలేదు. ముఖ్యంగా సోహెల్ ను ఆడపిల్లల మీద అరవొద్దని చెప్పి ఇంకోసారి రిపీట్ అయితే కొరడా చూపించిన హోస్ట్ నాగ్.. మెహబూబ్ మీద పుచ్చలేచిపోతాయ్ అన్న కామెంట్ మీద ఫైర్ అయ్యాడు. మెహబూబ్ ఏంటయ్య ఆ మాటలు.. బయట హోటల్ కు వెళ్లి అలా వెళ్తే 100 కి డయల్ చేసి మోకాల్ చిప్పలు ఇరగ్గొడతారంటూ నాగ్ సూపర్ ఫైర్ అయ్యాడు.
నాగార్జున ఈ విధంగా ఫైర్ అవడంపై హౌజ్ మేట్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మూడవ వారంలో జరిగిన ఉక్కు హృదయం టాస్క్ లోనే సోహెల్, మెహబూబ్ కాస్త అతి చేయగా మొదటిసారి కాబట్టి లైట్ తీసుకుని సమర్ధించిన నాగ్ ఈసారి మాత్రం ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. బిబి హోటల్ టాస్క్ లో భాగంగా హోటల్ సిబ్బందికి, గెస్టులకు మధ్య జరిగిన వివాదంలో నాగార్జున ఫైర్ అయ్యాడు.
ప్రోమో చూస్తేనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌజ్ నుండి గంగవ్వ బయటకు వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్ ద్వారా కూడా మరో హౌజ్ మేట్ ఎలిమినేట్ అవుతారా లేరా అన్నది చూడాలి.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: