బిగ్ బాస్ లో హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అతనే.. అందుకేనా అలా వాడేస్తున్నారు..!
మొన్న బిబి హోటల్ టాస్క్ లో అతనికి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా రీసెంట్ గా బిగ్ బాస్ ఆత్మ అవినాష్ లో దూరితే అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు. ఎలాంటి టాస్క్ ఇచ్చినా సరే అవినాష్ తన టాలెంట్ తో హౌజ్ లో కంటెస్టంట్స్ ను.. బయట ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. అతని కామెడీని కూడా మెచ్చని కొందరు ఇంటి సభ్యులు ఉన్నారు. అయితే వారికి కామెడీకి మీనింగ్ తెలియదు అని వదిలేయడం మంచిది.
బిగ్ బాస్ హౌజ్ లో జోకర్ గా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తన కామెడీతో అందరిని మెప్పిస్తున్నాడు. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నాడు అవినాష్. అంతేకాదు టాప్ 5లో కూడా ఉండే ఛాన్సులు అతనికి ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ హౌజ్ లో సూపర్ ఎంటర్టైనర్ గా అవినాష్ తన సత్తా చాటుతున్నాడు. అతన్ని ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అసలు నామినేట్ చేసేందుకు ఇస్టపడట్లేదు. సో ఇలానే వెళ్తే అవినాష్ కూడా స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది.