మహేష్, వెంకటేష్ ని మరోసారి కలపబోతున్న త్రివిక్రమ్...!!!
దాంతో త్రివిక్రమ్… మహేష్ ను పట్టించుకోవడం మానేశాడు. అయితే మహేష్ సతీమణి నమ్రత రంగంలోకి దిగి వీరిద్దరినీ మళ్ళీ కలిపినట్టు తెలుస్తుంది. ‘సర్కారు వారి పాట’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ సినిమా ఉంటుందనేది ఇండస్ట్రీ టాక్. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక మల్టీ స్టారర్ అనేది తాజా సమాచారం. గతంలో వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే అధికారిక ప్రకటన చేసారు.
ఆ ప్రాజెక్ట్ లో కథ ప్రకారం మరో హీరో కూడా నటించాల్సి ఉందట. మొదట పవన్ కళ్యాణ్ అనుకున్నారట. ఇప్పుడు మహేష్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరువాత మరోసారి పెద్దోడు చిన్నోడుని ఓకే స్క్రీన్ పై చూసే అవకాశం దక్కుతుంది.ఆ సినిమా మల్టీ స్టారర్ సినిమాలలోనే ఎన్నటికీ గుర్తుండిపోయే సినిమా అయ్యింది. ముఖ్యంగా ఈ తరం ఆ తరం అనే తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించింది. ఇక సినిమాకి ఎంత మంచి పేరొచ్చిందో అంతే హిట్ కూడా లభించింది. అలాగే ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా చాలా అవార్డులు అందుకుంది కూడా...!