మహేష్.. ఎన్టీఆర్.. దమ్మున్న కథ దొరికితే రికార్డుల ఊచకోతే..!

shami
సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే.. అబ్బో ఇక ఆ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుకోవడం ఖాయం. కరెక్ట్ సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే అది సాధ్యమయ్యే విషయమేనా.. మహేష్, తారక్ ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా ఇద్దరు హీరోలు పర్సనల్ గా చాలా క్లోజ్ గా ఉంటారు.

మహేష్ ను అన్నా అని ఆప్యాయంగా పలుకరిస్తాడు ఎన్.టి.ఆర్. మహేష్ కూడా తారక్ మీద అభిమానం చూపిస్తాడు. భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ కోసం చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు తారక్. మహేష్ అన్నా అంటూ సూపర్ స్టార్ పై తన గౌరవాన్ని చూపించాడు. మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎక్సయిటింగా ఎదురుచూస్తున్నారు. సరైన కథ దొరికితే మాత్రం రికార్డుల ఊచకోత అన్నట్టే.

అయితే ఈ ఇద్దరిని హ్యాండిల్ చేసే డైరక్టర్ ఎవరన్నది కూడా చర్చల్లోకు వస్తుంది. భారీ బడ్జెట్ తో పిరియాడికల్ మూవీగా సినిమా చేస్తే మాత్రం ఈ మల్టీస్టారర్ సినిమా కూడా రాజమౌళి చేతుల్లోకి వెళ్తుంది. అయితే త్రివిక్రం శ్రీనివాస్ కూడా ఈ ఇద్దరితో కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. మాటల మాత్రికుడు త్రివిక్రం ఇద్దరి స్టార్స్ ఇమేజ్ కు తగిన కథ సిద్ధం చేస్తే మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయం. మరి మహేష్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమా ఉంటుందా.. వస్తే ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి.                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: