బిగ్ బాస్ హౌజ్ లో ఈరోజు ఏం జరిగిందంటే..!

shami
బిగ్ బాస్ హౌజ్ లో మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. అఖిల్, అరియానాలతో రెండు గ్రూపులుగా చేసి గ్రూప్ ఒక్కరికి 250 గోల్డ్ కాయిన్స్ ఇచ్చి బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను చేసి ఎవరైతే కాయిన్స్ తగ్గించుకుని చివరగా తక్కువ కాయిస్ ఉన్న టీం గెలిచినట్టు చెప్పారు. ఈ టాస్క్ లో భాగంగా అఖిల్ మొదటి రెండు రౌండ్లు బెల్ మోగించి 10 కాయిన్స్, 25 కాయిన్స్, 20 కాయిన్స్ సంచాలకుడిగా చేస్తున్న సోహెల్ కు ఇచ్చాడు. ఇక అరియానా టీం నుండి కూడా 20, 20 కాయిన్స్ సోహెల్ ఇచ్చారు.
అఖిల్ టీం లో కుమార్ సాయి తన ఒంటి మీద ఉన్న బట్టలు కత్తిరించుకోగా.. హారిక తన జుట్టుని భుజాల మీద వరకు కట్ చేసుకుంది. ఇక అరియానా టీం నుండి అభిజిత్ తనకు సంబందించిన వస్తువులన్ని స్టోర్ రూం లో పెట్టగా.. లాస్య బిగ్ బాస్ పంపించిన అన్నిటిని కలిపి ఏర్పాటు చేసిన రెండు గ్లాసుల జ్యూస్ తాగింది. మొత్తానికి రెండు టీం లు ఈసారి గట్టి పోటీ పడుతున్నాయి.
వీకెండ్ లో నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో సోహెల్ తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మెహబూబ్ కూడా ఆట మీద దృష్టి పెడుతూ కొద్దిగా మారిపోయాడు. ఇక ఈరోజు హౌజ్ లో అభిజిత్ కూడా సోహెల్ కు సలహా ఇచ్చాడు. నువ్వు అరవడం వల్ల విషయం చిన్నదయ్యి నువ్వు అరవడమే పెద్దదిగా కనిపిస్తుందని.. అదొక్కటి మార్చుకోమని చెప్పాడు. సోహెల్ కూడా అందుకు సరే అని చెప్పాడు.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: