అనుష్క వెంట అంతమంది.. అరుంథతి లెక్క ఇది..!
స్టార్ హీరోయిన్ గా స్టార్స్ పక్కన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క ప్రాణం పోసింది. తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు క్యూ కట్టడానికి అనుష్క చేసిన అరుంధతి సినిమా ప్రధాన కారణమని చెప్పొచ్చు. అందుకే అనుష్క ఎప్పటికి ఎవర్గ్రీన్ అని చెప్పాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేకపోయినా సరే అమ్మడి ఇన్ స్టాగ్రాంలో 4 మిలియన్ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంది అమ్మడు.
ఈమధ్యనే వచ్చిన నిశ్శబ్ధం సినిమాతో అనుష్క తన ఫ్యాన్స్ ను నిరాశపరచింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఫైనల్ చేసిన అనుష్క త్వరలోనే వాటి వివరాలు బయటకు వస్తాయని చెప్పింది. అంతేకాదు ఈమధ్యనే ట్విట్టర్ లో కూడా అనుష్క ఎంట్రీ ఇచ్చింది. అలా ట్విట్టర్ లోకి వచ్చిందో లేదో ఇలా ఆమె వెంట దగ్గర దగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇన్ స్టాగ్రాంలో మాత్రం అడపాదడపా తన పిక్స్, అప్డేట్స్ షేర్ చేస్తున్నా ఇక్కడ మాత్రం 4 మిలియన్ ఫాలోవర్స్ తో అనుష్క సత్తా చాటుతుంది.