యాంకర్ ప్రదీప్ వైవా హర్షకు బ్రేకిస్తాడా...?
ఎందుకంటే, ఎన్నాళ్ళ నుంచో విడుదలకు నోచుకోకుండా ఉన్న "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. మిగతా సినిమాల్లోని వైవా హర్ష రోల్ అనేది ఒక ఎత్తైతే ఈ సినిమాలోని రోల్ ఒక ఎత్తు. వైవా హర్ష టాలెంట్ ను గమనించిన యాంకర్ ప్రదీప్ ఇందులో హర్ష కెరీర్ కు బ్రేక్ నిచ్చే మంచి రోల్ ను ఆఫర్ చేశాడట. వైవా తనదైన శైలి కామెడీ టైమింగ్స్ తో రెచ్చిపోయాడట. ఇక, టాలీవుడ్ లో వైవాకు ఆఫర్స్ విషయంలో ఢోకా లేదన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రదీప్ మాచిరాజు నటించిన "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే మూవీ ఈ నెల 29న విడుదలవుతుంది. ఈ సినిమాలోని ప్రదీప్ నటనకు చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాదే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెలాఖరులో విడుదలకు నోచుకుంది.
ఈ సినిమా ఎటువంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను వెరైటీ సబ్జెక్ట్ తో తెరకెక్కించారు. పునర్జన్మ కాన్సెప్ట్ తో ఈ మూవీను రూపొందించారు. గతజన్మ ప్రేమానుబంధం యువజంటను కలుపుతుందా లేదా అన్నది కాన్సెప్ట్. మూవీ లవర్స్ ఈ సినిమాపట్ల విపరీతమైన క్యూరియాసిటీను ప్రదర్శిస్తున్నారు.
ఈ సినిమాలో అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా "రెడ్" మూవీలో కూడా సందడి చేసింది. కానీ, ప్రదీప్ సినిమాలో అమృతకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ లభించింది. అమృతకు ఈ సినిమా మరిన్ని ఆఫర్స్ ను తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.