ఆర్మూర్ లో పరుగులు పెడుతున్న హీరో,హీరోయిన్.. అందుకేనా?

Satvika
మజిలీ సినిమా తర్వాత నాగ చైతన్య మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవల విడుదల అయిన వెంకీ మామ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది.ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా కు లవ్ స్టోరీ అనే టైటిల్ ను ఖరారు చేసారు. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. చివరి దశ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తెలంగాణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు.



 ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలోని బోడకొండ జలపాతం వద్ద సందడి చేశారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లోని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. సెప్టెంబర్ లో సినిమా రీ షూట్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఆపకుండా సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.ఆర్మూర్ సమీపంలోని నవసిద్ధుల గుట్ట వద్ద ‘లవ్ స్టోరీ’ చిత్రీకరణ జరిగింది. నాగచైతన్య, సాయి పల్లవిలపై కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో స్థానికలు తమ స్మార్ట్ ఫోన్లలో ఆ సన్నివేశాలను  బంధించారు ..నవసిద్ధుల గుట్టపై సాయి పల్లవి చేయి పట్టుకుని చైతు పరుగులు పెడుతున్న సన్నివేశానికి సంబందించిన సీన్ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.



తెలంగాణకు సంబంధించి లవ్ స్టోరీ కనున సినిమా మొత్తాన్ని తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిదా సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసలో చంపేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు..ఇంక కొద్ది రోజులలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు.వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రకటించింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని లు ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటివరకు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ అవుతుందనే దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: