బిగ్ బాస్ 4 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు హౌజ్ మేట్స్..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 ఆరవ వారం నామినేషన్స్ లో 9 మంది హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో టాప్ 5లో ఉన్న కంటెస్టంట్స్ కూడా ఉండటంతో ఓ ముగ్గురు హౌజ్ మేట్స్ కు డేంజర్ జోన్ తప్పేలా లేదని తెలుస్తుంది. అభిజిత్, లాస్య, అఖిల్, అరియానా ఇలా గేమ్ ఆడుతున్న వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఎనాలసిస్ ప్రకారం నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో ముగ్గురు మాత్రం రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు.  

ఇంతకీ ఆ డేంజర్ జోన్ లో ఉన్న హౌజ్ మేట్స్ ఎవరు అంటే.. ఒకరు హారిక.. రెండో హౌజ్ మేట్ మోనాల్.. థర్డ్ కంటెస్టంట్ నోయెల్. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. కుమార్ సాయి కూడా నామినేషన్స్ లో ఉండగా అతను ఈమధ్య ఆటల్లో చురుకుగా పాల్గొంటున్నాడు కాబట్టి అతను సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అభిజిత్, లాస్య, అఖిల్ ఎలాగు స్టార్ కంటెస్టంట్స్ గా ఉన్నారు వారు లేకపోతే ఆటే లేదు కాబట్టి వారు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అరియానా కూడా తన వరకు టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇక మిగిలింది నోయెల్, మోనా, హారిక మాత్రమే. హారిక ఈమధ్య ఎందుకో ఆట మీద అంత ఫోకస్ గా ఉండట్లేదని తెలుస్తుంది. ఇక నోయెల్ గంగవ్వలా తనని పంపించేస్తే బాగుండు అని అంటున్నాడు. మోనాల్ ఎప్పుడు అఖిల్ తోనే కనిపిస్తుంది. అతని చుట్టూ తిరుగుతూ అనవసరమైన గొడవలకు దారి తీస్తుంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారో చూడాలి.                             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: