బ్రేకింగ్ : 'సర్కారు వారి పాట' లో హీరోయిన్ గా ఆమె ఫిక్స్ .... అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ....!!
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ విషయాన్ని నేడు కన్ఫర్మ్ చేస్తూ సర్కారు వారి పాట మూవీ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా హీరోయిన్ కీర్తి ని తమ సర్కారు వారి పాట మూవీ లోకి అహ్వాహిస్తూ, ఈ సినిమా తప్పకుండా ఆమెకు ఎంతో మెమొరబుల్ గా నిలిచిపోతుంది అంటూ బర్త్ డే విషెస్ తెలియచేసారు. మరోవైపు పలువురు ఇతర సినిమా ప్రముఖులు, కీర్తి సురేష్ అభిమానులు ఆమెకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. మరి తొలిసారిగా సూపర్ స్టార్ తో జతకడుతోన్న కీర్తి సురేష్, ఈ సర్కారు వారి పాట తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి ...!!