ప్రజలకి గుండెపోటు తెప్పించొద్దంటున్న నటి...
ప్రస్తుతం యూఏఈ లో టీ20 క్రికెట్ లీగ్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసినదే. ఐపీఎల్ అంటే ప్రతీ బంతి కూడా ఎంతో ముఖ్యం . ఇలా ప్రతీ మ్యాచ్ కూడా అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. ప్రేక్షకులని టీవీకి కట్టి పడేస్తోంది. గురువారం పంజాబ్×బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసినదే. అయితే ఆ మ్యాచ్ గురించి బాలీవుడ్ నటి ప్రీతి జింటా పలు విషయాలని షేర్ చేసుకుంది. ఆ మ్యాచ్ ఆఖరి బంతి వరకు కూడా ఆసక్తికరంగా కొనసాగింది. అయితే మ్యాచ్‌లో పటిష్ట స్థితిలో ఉన్న పంజాబ్.. గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఆఖరి 18 బంతుల్లో 11 పరుగులే పంజాబ్ విజయానికి కావాల్సింది. వెంటనే కొట్టేస్తారులే అనుకుంటే ప్రేక్షకులకి ట్విస్ట్ తగిలింది. ఇలా వాళ్ళు ఆఖరి బంతి దాక ఆడారు... అలా ఆఖరి బంతికి విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠతో విజయాన్ని ఆస్వాదించిన పంజాబ్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా శుక్రవారం ఇలా అన్నారు.... ఇలా తీవ్ర ఉత్కంఠకు గురిచేసి ప్రజలకు గుండెపోటు కలిగేలా మ్యాచ్‌ను ముగించకూడదని ఆమె సరదాగా చెప్పారు.
విజయం ఆనందమే కానీ క్రికెట్ పేరుతో ప్రజలకు గుండెపోటు కలిగించకూడదని మా జట్టును కోరుతున్నాను అని ప్రీతి చెప్పింది. పంజాబ్ మ్యాచ్‌లు బలహీనమైన గుండె కలిగిన వాళ్లు చూడటానికి సిద్ధపడకూడదని హెచ్చరిస్తున్నాను అని ఆమె అన్నారు. బెంగళూరు బౌలర్లు మంచి బౌలింగ్ చేశారు అని ఆమె వాళ్ళని అభినందించారు. ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాల తో పట్టిక లో ఆఖరి స్థానం లో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. పంజాబ్ ఆఖరి బౌల్ వరకు ఆడడం ఇదే తొలి సారి కాదు. అనేక మార్లు ఇదే సిట్యుయేషన్ ని మనం చూసాం.