హైదరాబాద్ డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపిన తమన్నాభాటియా
"కరోనా సోకిన సమయంలో నా ఆరోగ్యం బాగా క్షీణించింది. కాంటినెంటల్ హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు నాకు మెరుగైన కరోనా వైద్యం అందించారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భయాన్ని బలహీనతను పోగొట్టి కరోనా వ్యాధిని నయం చేసిన డాక్టర్లకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను," అని తమన్నా భాటియా చెప్పుకొచ్చారు. గతంలో తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే వారిద్దరూ కూడా కరోనా నుండి కోలుకున్నారు.
ఇకపోతే తమన్నా చివరి సారిగా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఒక ఐటమ్ పాటలో కనిపించారు. ఆమె ఇప్పుడు దట్ ఈజ్ మహాలక్ష్మి, సిటీ మార్, హిందీ చిత్రం బోలే చుడియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కన్నడ పరిశ్రమలో భారీ హిట్ అయిన ఈ రొమాంటిక్ చిత్రం తెలుగులో రీమేక్ గా రావడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిటీ మార్ సినిమాలో తమన్నా భాటియా సరసన గోపీచంద్ నటిస్తున్నారు.