దెబ్బకి దిగొచ్చిన ఇల్లీ బేబీ... ఛాన్స్ చాలట !
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మన హీరోలు ఇల్లీని పట్టించు కోవడమే మానేశారు. రష్మిక, నివేదా థామస్, లాంటి కుర్ర హీరోయిన్స్ దెబ్బకు ఇప్పుడు నెత్తి బొప్పి కట్టి నేల మీదకి వచ్చేసిందట ఇల్లీ బేబీ. మీరు ఎంత అనుకుంటే అంతే ఇవ్వండి, కానీ సినిమాలో మాత్రం చాన్స్ ఇవ్వండని తన పాత దర్శకులను రిక్వెస్ట్ చేస్తోందట ఇలియానా. టాలీవుడ్ లో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ గా రికార్డ్ కెక్కిన ఇలియానా ఇప్పుడు సినిమాలు రావడమే కష్టంగా ఉంది.
నిజానికి టాలీవుడ్ టాప్ ప్లేస్‌లో ఉన్నప్పుడు 'బర్ఫీ'తో బాలీవుడ్ కి మకాం మార్చండి ఈ భామ. టాలీవుడ్‌ని పక్కనపెట్టేసి అక్కడే వరుస సినిమాలు చేసుకుంది. అయితే తెలుగు ఇండస్ట్రీని పక్కనపెట్టి మరీ బీటౌన్ కే అంకితమైపోయినా ఇలియానాకి అక్కడ చెప్పుకోదగ్గ పేరు అయితే రాలేదు. దీనికి తగ్గట్టే బాయ్‌ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక ఆంటీలా మారిపోయింది ఈ బ్యూటీ. కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసుకోకుండా ఇప్పుడు బరువుతో పాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునే పనిలో ఉందట ఇలియానా.