పూలతో రొమాంటిక్ గా కనిపించిన పాయల్..ఎందుకో తెలుసా..
మొదటి సినిమాలోనే అతిగా అందాలను చూపించడం తో తర్వాత సినిమాలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఏడాది లో పాయల్ డిస్కో రాజా, వెంకీ మామ సినిమా లలో కనిపించింది. వెంకిమామ లో అమ్మడు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. దీంతో ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. మొన్నటి వరకు సోషల్ మీడియా లో అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన ఈ అమ్మడు నిన్నటి నుంచి సినిమా షూటింగులో పాల్గొంటుంది.
ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు షూటింగ్ తాలూకు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ హంగామా చేస్తోంది. మొన్ననే తాను కరోనా టెస్ట్ చేయించుకుంటున్న పిక్స్ ను షేర్ చేసింది.తాజాగా తాను షూటింగ్ లోకేషన్ లో రెడీ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. మేకప్ రూమ్లో ముఖానికి రంగులు అద్దించుకుంటూ థైస్ కనిపించే స్కట్తో రచ్చ చేస్తూ కనిపించింది పాయల్. ఎలా కనిపిస్తున్నానని అందర్నీ అడుగుతూ.. సౌత్ ఇండియన్ కల్చర్, తెలుగమ్మాయిలా మారిపోయాను అంటూ నవ్వింది. తెలుగు సినిమాలలో అవకాశాలు ఎక్కువగా వస్తుండటం తో ఇక్కడే సెటిల్ అయింది. ప్రస్తుతం నరేంద్రతో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తుంది. ఆ సినిమాలు అన్న పాయల్ ఆశలను నెరవేరుస్తాయేమో చూడాలి..