దటీజ్ బాలయ్య.. వరద బాధితులకు కోటిన్నర విరాళం!

Chaganti
హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో కురిసిన కుండ పోత వర్షాలు నగరం మొతాన్ని ముంచెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వర్షం మొదలయి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వందలాది కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వందలాది కాలనీల్లో నీరు నిలిచిపోయింది. అది కాక మొన్న మళ్ళీ కురిసిన వర్షానికి ఇబ్బందులు పడడం నగరవాసి వంతయ్యింది. వేలాది అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరింది. లిఫ్ట్‌ లు కూడా పనిచేయకపోవడంతో జనం  బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
 ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కురిసిన కుంభవృష్టి... హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. ఏకధాటి వానతో చాలా కాలనీలు నీట మునిగాయి. రోడ్లపైకి వరద పోటెత్తడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అక్టోబరు నెలలో ఈ స్థాయి వర్ష పాతం నమోదు కావడం గత వందేళ్లలో ఇదే రెండోసారి అని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడుప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడిందని చెప్పచ్చు.
అయితే ఇప్పటిదాకా ఆ బాధితులను ఆడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ విరాళాలు ప్రకటించలేదు. అయితే, నటసింహా నందమూరి బాలకృష్ణ రూ. 1.5 కోట్ల విరాళం ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశం మీద బాలకృష్ణ వైపు నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. అంతే కాదు పాతబస్తీలోని 1000 కుటుంబాలకు ఆహార పొట్లాలను కూడా అందజేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా దటీజ్ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో గర్వంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: