ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. ‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్’ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాణంలో వి.ఎన్.ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు.
ఉదయ్ కిరణ్,
రీమా సేన్ జంటగా నటించిన ఈ చిత్రం 175రోజుల వరకూ విజయవంతంగా ఎన్నో కేంద్రాల్లో ఆడింది.
ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోని చేసిన చిత్రమిది. ఆర్.పి.పట్నాయక్ సంగీతమందించిన ఈ చిత్రంలో తూనీగా తూనీగా, చెప్పవే ప్రేమ.. వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
చిన్నప్పుడే విడిపోయిన ప్రేమికులు పెద్దయ్యాక ఎలా కలుసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.2001వ సంవత్సరం
అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ
బ్లాక్ బస్టర్ చిత్రానికి హీరోగా
ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఓ స్టార్
హీరో రిజెక్ట్ చేస్తే తరువాత ఆ అవకాశం
ఉదయ్ కిరణ్ కు దక్కిందట. ‘మనసంతా నువ్వే’ ను రిజెక్ట్ చేసిన స్టార్
హీరో మరెవరో కాదు.. మన
సూపర్ స్టార్ మహేష్ బాబు.
2001 టైములో యం.ఎస్.రాజు నిర్మాణంలో
మహేష్ ఓ చిత్రం చెయ్యడానికి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ టైములో మన యం.ఎస్.రాజు గారు
మహేష్ కు దర్శకుడు వి.ఎన్.
ఆదిత్య తో ‘మనసంతా నువ్వే’ కథను వినిపించారు. అయితే అప్పుడు మంచి కమర్షియల్
సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్న మహేష్.. ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట. అలా అది
ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్ళింది. అటు తరువాత మహేష్- యం.ఎస్.రాజు నిర్మాణంలో ‘ఒక్కడు’ అనే
బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చింది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్ డేట్స్ కొరకు
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...