ఆ రీమేక్ లో పవన్ నటించట్లేదు...!!
అయితే ఈ చిత్రంలో నటించేందుకు బాలయ్య ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ, రానా మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించగా ఫైనల్ చేసినట్లు సమాచారం.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా లో నటిస్తున్న పవన్.. ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాల తర్వాత మలయాళ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రానా తో పవన్ నటించబోతున్నాడట. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్యప్పన్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రాజెక్టులో నటించడం లేదట. ముందుగా అనుకున్న ప్రకారం రవితేజనే వన్ ఆఫ్ ది హీరోగా కనిపించనున్నట్టు టాక్.ఒరిజినల్ వెర్షన్ లో బిజూమీనన్ పోషించిన పోలీసాఫీర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్.మరో హీరోగా రానా కనిపించనున్నాడు.మరి పవన్ ఈ రీమేక్ లో నటించక పోవడానికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ... ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారనే చెప్పొచ్చు...!!