అక్కినేని వారబ్బాయి ఇలా అంటున్నాడేంటి బాబూ... వైరల్..!!!
అయితే..ఈ సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది.సినిమాను ప్రమోట్ చేయడంలో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.ఈ బ్యాచిలర్ కుర్రోడు తాజాగా ప్రీ టీజర్‌తో పలకరించాడు. ఆ టీజర్ లో హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా కానీ ఈ మ్యారీడ్ లైఫే.. అయ్యయ్యయ్యయ్యో అంటూ బ్యాలెన్స్ తప్పిందన్నట్లుగా ఓపెన్ అయ్యాడు.ఈ నెల 25 న టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ వీడియో అఖిల్ సినిమాకు బెస్ట్ ప్రమోషన్‌గా నిలుస్తూనే, రియల్ లైఫ్‌కి కూడా కాస్త సింక్ అవుతుండటంతో నెటిజన్ల కామెంట్లతో వైరల్ అవుతుంది.
అఖిల్ మ్యారేజ్ విషయానికొస్తే.. అప్పటిలో శ్రేయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.అయితే అది రద్దు అయ్యింది..అందుకు కారణాలు బయటకు చెప్పలేదు. తాజాగా మరో వార్త గుప్పుమంది.. ఓ బిజినెస్ మ్యాన్ కూతురితో పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.ఇప్పుడు మాత్రం సినిమాల పై మాత్రం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా హిట్ అయితే పెళ్లి చేసుకుంటాడు అని అక్కినేని అభిమానులు అంటున్నారు. ఈ విషయం లో క్లారిటీ రావాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..