బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ...!!
ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.ప్రస్తుతం ప్రభాస్‌తో రాథేశ్యామ్, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో నటిస్తుంది పూజ.మరోవైపు తన మాతృభాష హిందీలోనూ పూజాకు మంచి డిమాండే ఉంది. ఆల్రెడీ ఆమె హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో నటించింది. త్వరలోనే ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోందంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఆ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈలోపు ఒక క్రేజీ, భారీ చిత్రంలో పూజాకు అవకాశం దక్కింది. ఆ సినిమా పేరు..బాలీవుడ్లో ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా, హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి రూపొందించబోయే కొత్త కామెడీ మూవీ సర్కస్.
ఇంతకుముందు అతడితో 'సింబా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన రణ్వీర్ సింగ్ ఇందులో హీరోగా నటించనున్నాడు. అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇంతకుముందు 'గోల్ మాల్' సిరీస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోహిత్.. ఇప్పుడు 'సర్కస్'ను కూడా కామెడీ ఫ్రాంఛైజీగా రూపొందించనున్నాడట. అంటే ఈ సిరీస్‌లో ఆ తర్వాత కూడా సినిమాలు వస్తాయన్నమాట. అదే నిజమైతే పూజా పంట పండినట్లే.చివరగా పూజా 'హౌస్ ఫుల్-4'లో నటించింది. దానికి నెగెటివ్ టాక్ వచ్చినా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఓవైపు సల్మాన్ సినిమాలో ఛాన్స్ అనుకుంటుండగానే.. రణ్వీర్తో నటించే అవకాశం రావడం పట్ల పూజ ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు...!!