మా నాన్న సెక్స్ చేస్తూ చనిపోయారు: ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్!

Maahi
అవునూ.. హాలీవుడ్ నటుడు మరియు ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే తండ్రి సెక్స్ చేస్తూ చనిపోయాడట. అయితే అది ఎపుడు జరిగింది? ఈ విషయం బయటి ప్రపంచానికి ఎలా తెలిసింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటుడు ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే ఇటీవల తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం అత్యంత ఆదరణ పొందుతున్నది. మెక్ కనాగే తన జీవితంలో ఎదురైన మరిచిపోలేని ఘటనలకు అక్షర రూపం ఇచ్చాడు. 'గ్రీన్ లైట్స్' పేరుతో ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ 20వ తేదీన ఆవిష్కరించారు. అయితే అనంతరం మెక్ తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ..  "నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నాన్న మా అమ్మతో సెక్స్ చేస్తున్నప్పడు గుండెపోటుతో చనిపోయారు. ఇది నాజీవితంలో అత్యంత విషాదకరం ఘటన. నా తల్లిదండ్రుల జీవితం ప్రత్యేకమైనది. అనేకసార్లు వాళ్లు విడిపోయారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఒక్కటయ్యారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు" అంటు మెక్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజం.
ఇదిలా ఉంటే.. మ్యాథ్యూ మెక్ కనాగే రొమాంటిక్ కామెడీ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. "ది వెడ్డింగ్ ప్లానర్", "హౌటూ లూస్ ఏ గయ్ ఇన్ 10 డేస్", "ఫెయిల్యూర్ టు లాంచ్ ఫూల్స్", "గోల్డ్ ఘోస్ట్ ఆఫ్ గర్లఫ్రెండ్స్ పాస్ట్" చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. "ది లింకన్", "లాయర్ బెర్నీ", "మ్యాజిక్ మైక్", "ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కిల్లర్ జో" చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా తీసుకొచ్చిన గ్రీన్లైట్స్ బుక్ కూడా విశేషంగా ఆకట్టకుంటున్నది. తాజాగా తీసుకొచ్చిన గ్రీన్లైట్స్ బుక్ కూడా విశేషంగా ఆకట్టకుంటున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: