ఏంటీ .... దసరా రోజున బాలయ్య నూతన చిత్రం ప్రారంభం కానుందా ....??

GVK Writings
నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది ఆరంభంలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో పాటు డిసెంబర్ లో రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వాటి అనంతరం ప్రస్తుతం తనకు ఎంతో కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ కు ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తుండగా ఒక ప్రముఖ మలయాళ నటి ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు బాలయ్య ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది.

ఇకపోతే రానున్న దసరా పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్న నూతన సినిమా ప్రారంభోత్సవం జరగనుందని ఇప్పటికే దీని కథ, కథనాలు పూర్తిగా సిద్ధం చేసిన దర్శకుడు బి.గోపాల్ దానిని వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం పట్టాలెలెక్కించనున్నారని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. అలానే ఒక టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ గా రూపొందించనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: