అవునూ.. సీనియర్ హీరోయిన్ భూమిక తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. అయితే ఇంతకీ తనపై వస్తున్న ఆ రూమర్లు ఏంటి? అయితే ఆమె ఎలా వాటికి సమాధానం చెప్పింది? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా సీనియర్ హీరోయిన్ భూమిక తన భర్త, యోగా గురు భరత్ టాకూర్‌తో విడిపోయిందని గత కొంత కాలంగా సెపరేట్‌గా వుంటోందని జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై భూమిక స్పందించలేదు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇదిలా వుంటే తన వివాహ బంధంపై వస్తున్న రూమర్లపై భూమిక సైలెంట్‌గానే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2007లో ఇదే రోజు యోగా గురు భరత్ టాకూర్ని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా వున్నాడు. తను భరత్ టాకూర్‌తో విడిపోలేదని, ఇద్దరం వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్తాదిస్తున్నామని క్లారిటీ ఇచ్చేసింది. మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా భర్త భరత్ టాకూర్‌తో వున్న ఓ ఫొటోని షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్‌ని పెట్టింది. "వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒకే అడుగుతో మొదలవుతుంది …. ప్రేమ.. అది ప్రేమే, ప్రేమని నేర్చుకోవడం.. అవగాహన..ఇదొక ఆనందకరమైన ప్రయాణం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం అంటే మనమే .. . దేవుడు మమ్మల్ని మా ప్రయాణాన్ని ఆశీర్వదించాలి.. జీవితంలో మీరు చేసే పనుల పట్ల మీ అంకితభావం చూసి గర్విస్తున్నాను. మ్యారేజ్ ఆనివర్సీరీ శుభాకాంక్షలు" అని షేర్ చేసి రూమర్లకు చెక్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. నేచురల్ స్టార్ నాని నటించిన "ఎంసీఏ" చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. "యూటర్న్", "సవ్యసాచి", "రూలర్" చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్‌నంది రూపొందిస్తున్న "సీటీమార్" చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.