హీరో విజయ్ ఆంటోనీ సినిమాల లిస్టు మరియు వాటి ఫలితాలు!

Maahi
విజయ్ ఆంటోనీ.. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆంటోనీ తర్వాత హీరోగా ఎదిగాడు. ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ మార్కెట్ సంపాదించుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అదే రేంజ్ కొన సాగించలేకపోయాడు. అయితే విజయ్ ఆంటోనీ నటించిన సినిమాల (తెలుగు) లిస్టు మరియు వాటి ఫలితాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
1. నకిలీ: ఫ్లాప్
2. డాక్టర్ సలీమ్: హిట్
3. బిచ్చగాడు: బ్లాక్ బస్టర్ హిట్
4. బేతాళుడు: ఏవరేజ్
5. యమన్: ఏవరేజ్
6. ఇంద్రసేన: ఫ్లాప్
7. కాశి: ఫ్లాప్
8. రోషగాడు: ఫ్లాప్
9. కిల్లర్: సూపర్ హిట్
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు" సినిమాకు సీక్వెల్ గా వస్తున్న "బిచ్చగాడు 2" సినిమాలో నటిస్తున్నాడు. అయితే గత నెల షూటింగ్ ను ప్రారంభిచబోతున్న ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఆంటోనీ తెలుగులో ట్వీట్ చేశారు. "నన్ను నమ్ముకున్న నిర్మాత దర్శక మరియు సినీ కార్మిక సోదరుల శ్రేయస్సున్ని ఆకాంక్షిస్తూ.. నేను రేపటి నుండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాను. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తూ.. నేను మీ విజయ్ ఆంటోని" అంటూ విజయ్ ఆంటోనీ ట్విట్  చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. తెలుగు వర్షన్ కోసం కొన్ని ప్రత్యేకమైన సీన్స్ ను షూట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. గత ఆరు నెలలుగా విజయ్ ఆంటోనీ సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని అతడు తెలుగులో ట్వీట్ చేయడంతో తెలుగు వారు అంతా కూడా ఫిదా అవుతున్నారు. తెలుగు హీరోలు తెలుగులో ట్వీట్స్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాంటిది ఒక తమిళ హీరో అయ్యి ఉండి తెలుగులో ట్వీట్ చేయడం నిజంగా అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: