కొద్దిగ్యాప్ ఇవ్వండి చాలు ... అల్లుకుపోతానంటున్న త్రివిక్రమ్ ....??

GVK Writings
ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా మంచి జోష్ మీద కొనసాగుతున్న హీరో మహేష్ బాబు అతిత్వరలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఆయనకు మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు అది సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది.

త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలో ప్రారంభం కాబోతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మహేష్ బాబు. అయితే ప్రస్తుతం మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్న రాజమౌళిసినిమా రిలీజ్ అయి ఆపై కొంత గ్యాప్ తీసుకున్న అనంతరమే మహేష్ సినిమా పై దృష్టి పెట్టనున్నారని అంటున్నారు.

కాగా ఈ ప్రక్రియ అంతా పూర్తి అవడానికి మరొక నాలుగు నుండి ఆరు నెలల వరకు సమయం పట్టే ఛాన్స్ ఉందని, అయితే ఈ లోపు తనతో సినిమా చేసేందుకు ఛాన్స్ ఇస్తే ఈ ఆరు నెలల గ్యాప్ లోనే సినిమాను పూర్తి చేసి థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాను అంటూ మహేష్ ని కోరాడట త్రివిక్రమ్. కాగా మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాకు మరింత సమయం పట్టనుండటంతో త్రివిక్రమ్ ని లైన్లో పెట్టారని అలానే అతి త్వరలో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు ఓపిక పట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: