తెలుగు బ్యూటీల సినీ కెరీర్ ఆ విషయంలో మారదా?
అయితే ఈ హీరోయిన్‌కి కేశవ తర్వాత మరో తెలుగు సినిమా చెయ్యడానికి మూడేళ్లు పట్టింది. టక్ జగదీష్ తో మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తోంది రీతు. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో నలుగురు హీరోయిన్లు నటించగా ఆ నలుగురిలో తెలుగు అమ్మాయి ఐశ్వర్యా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు దక్కాయి. అయితే ప్రశంసలు తప్ప ఈమెకి భారీ అవకాశాలు అయితే దక్కలేదు. ఈమె కూడా నాని టక్ జగదీష్ లాంటి చిన్న సినిమాలే చేస్తోంది.
ఇక మనదగ్గర పెద్దగా అవకాశాలు రాకున్నా బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తోన్న తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ళ. అడివి శేష్ గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో మెరిసిన ఈ హీరోయిన్ కి తెలుగునాట మాత్రం పెద్దగా అవకాశాలు రాట్లేదు. శోభితకి అడివి శేష్ తదుపరి సినిమా మేజర్ తప్ప మరో తెలుగు సినిమా లేదు. ఈమె కాక ఈషా రెబ్బా కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్న తెలుగు హీరోయిన్ పేరు. ఈమె వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు అనుకున్న గుర్తింపు రాలేదు. మరి వీళ్ళు ఎప్పటికి లైం లైట్ లోకి వస్తారో ఏమో ?