దసరా కాదు, దీపావళి.. మాట మార్చిన పవన్

Deekshitha Reddy
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. సినిమా మొదలైనప్పుడే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన దర్శక నిర్మాతలు ఆ తర్వాత ఓ ఆడియో సాంగ్ బైటకు వదిలారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే ఆ తర్వాత మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా దసరా సందర్భంగా పవన్ వకీల్ సాబ్ టీజర్ విడుదలవుతుందని ఆశపడ్డారు అభిమానులు. అయితే సినిమా యూనిట్ మాత్రం ఆ ఆశలపై నీళ్లు చల్లింది.

లెక్కప్రకారం వకీల్ సాబ్ టీజర్ దసరాకు రావాలి. యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం లేనప్పటికీ పవన్ ఫ్యాన్ గ్రూపుల్లో ఇంటర్నల్ గా ఈ విషయం పాకిపోయింది. మేకర్స్ కూడా దసరాకే అన్నీ అన్నట్టు రెడీ చేసుకున్నారు. కట్ చేస్తే, వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ వాయిదా పడింది. దసరాకు రావాల్సిన వకీల్ సాబ్ టీజర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కుదిరితే దీపావళికి టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
నిజానికి 2 వారాల కిందటే వకీల్ సాబ్ టీజర్ పనులు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. టీజర్ వర్క్ కూడా పూర్తయింది. అనుకుంటే దసరాకే దాన్ని రిలీజ్ చేయొచ్చు. కానీ ఆఖరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పవన్ తో చర్చించి, రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత.. ఏకంగా విడుదల తేదీతో టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. ఈ సినిమా షూటింగ్ మొదలైతే ఏకధాటిగా నెలరోజులపాటు పవన్ హాజరు కావాల్సి ఉంటుంది. బ్రేక్ లేకుండా పవన్ కాల్షీట్లు తీసుకుని ఆ తర్వాతే షూటింగ్ తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. వకీల్ సాబ్ పని పూర్తయిన తర్వాతే కొత్త సినిమా పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారట పవర్ స్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: