ప్రభాస్ తో ధూమ్ 4.. మాములుగా ఉండదు..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ అవనున్నాడా అంటే అవుననే చెప్పాలేమో. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. తెలుగు ఆడియెన్స్ తో సమానంగా ఓ విధంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే ఓన్ చేసుకున్నారు నార్త్ ఆడియెన్స్. అందుకే ప్రభస్ పెరిగిన మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నాడు. సాహో కూడా అలా వర్క్ అవుట్ చేశారు. ప్రస్తుతం రాధే శ్యాం కూడా అదరగొడుతుంది.
ఆదిపురుష్ అంటూ బాలీవుడ్ స్ట్రైట్ సినిమాతో సంచలనం సృష్టిస్తున్నాడు ప్రభాస్. ఇక ఇదిలాఉంటే ప్రభాస్ తో ధూమ్ 4 చేయాలని యశ్ రాజ్ ఫుకున్స్ వారు తెగ ప్రయత్నిస్తున్నారు. ధూమ్ 4 సినిమాలో హృతిక్ రోషన్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. ఇక ప్రభాస్ ను ఒప్పించి విలన్ గా చేయాలని చూస్తున్నారు. యశ్ రాజ్ సంస్థ 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇచ్చింది. అందులో ధూమ్ ఒకటి. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ధూం నాల్గవ సీజన్ కు రెడీ అవుతుంది.
ధూమ్ 4లో ప్రభాస్ ఓకే చెబితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇప్పటికే దానికి సంబందించిన కథ రెడీ చేశారు. ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అతను ఓకే అంటే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ధూమ్ 4 ను తెరకెక్కించాలని చూస్తున్నారు. కచ్చితంగా ధూమ్ 4లో ప్రభాస్ ఉంటే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ధూం 4లో ప్రభాస్ నటిస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.                                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: