బిగ్ బాస్ 4 : మోనాల్ సేఫ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 లో ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు ఎవరిని సేఫ్ చేసే అవకాశం ఉందన్నది చూస్తే.. బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే షో నడిచింది. బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమ మొదలైంది ప్రీమియర్, అవార్డ్స్, ఇక హౌజ్ మేట్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో షో ఆసక్తికరంగా ఉంది.
మాములుగా అయితే నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేయడం. సండే రోజు ముగ్గురు, నలుగురు నామినేషన్స్ లో వారిని టెన్షన్ లో పెట్టి చివరగా ఒకరిని ఎలిమినేట్ చేయడం లాంటివి జరుగుతాయి. కాని బిగ్ బాస్ సీజన్ 4లో ఈసారి కూడా గెస్ట్ హోస్ట్ వస్తున్నారు. అది ఎవరో కాదు సమంత. మామ బదులుగా సమంత ఈ ఆదివారం షో హోస్ట్ చేస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.
అభిజిత్, మోనాల్, దివి, అరియానా, నోయెల్, అవినాష్ ఈ వారం వీరు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు సేవ్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూస్తే మాములుగా అందరు మోనాల్ ఎలిమినేట్ అవుతారని అనుకోగా ఈసారి కూడా బిగ్ బాస్ మోనాల్ ను సేవ్ చేసి దివిని ఎలిమినేట్ చేశాడని తెలుస్తుంది. హౌజ్ లో దివి తన ఆట తాను ఆడుతున్నా ఇంకా వెనకపడ్డదని చెప్పాలి. అందుకే ఆమెకు గుడ్ బై చెబుతున్నారని టాక్. అయితే ఓ మాట ఈ దసరాకి అసలు ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు. అదే జరిగితే మోనాల్, దివి ఇద్దరు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: