బిల్లా-రంగా.. పవన్ సినిమా టైటిల్ ఫిక్స్..
సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.12గా సిద్ధమవుతున్న సినిమా ఇది. మలయాళ అప్పప్పన్ కోషియమ్ లో బిజు మేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోసిస్తారు. పృథ్వీరాజ్ క్యారెక్టర్లో రానా నటిస్తాడని అంటున్నారు. ఇందులో పవన్ పేరు బిల్లా అనే వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కన మరో కీలక పాత్రధారి రానా పేరు రంగా అవుతుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో బ్యాగ్రౌండ్లో ‘బిల్లా.. రంగా’ అనే వాయిస్ వినిపిస్తోంది. అలా ఇదే సినిమా పేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలందిస్తున్నారు. మిగతా స్టార్ క్యాస్ట్ గురించి త్వరలోనే ప్రకటన వెలువడుతుంది. 1982లో వచ్చిన ‘బిల్లా రంగా’లో చిరంజీవి, మోహన్‌బాబు నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నారు. ఇది పూర్తికాకముందే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు. లాక్ డౌన్ కాలంలో మరో రెండు సినిమాలు కూడా అనౌన్స్ అయ్యాయి. అయితే ఇంతలోనే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కూడా తెరపైకి వచ్చింది. అంటే పవన్ చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయనమాట. ఇవన్నీ చకచకా పూర్తి చేయాలని పవన్ టార్గెట్ పెట్టుకున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. పవన్ నుంచి ఏడాదికి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.