బిగ్ బాస్ నుంచి మరో వికెట్ అవుట్... ఆయనేనా..?
ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎలిమినేషన్ కూడా వివాదాస్పదనే అయిందని అంటున్నారు. ఈ వారం తప్పకుండా ఫలానా వారు ఎలిమినేట్ అవుతారు అని వారు ఆట తీరును బట్టి ఆడియన్స్ అంచనాకు వస్తున్నారు. ఓట్లు కూడా అలాగే వేస్తున్నారు. కానీ బిగ్ బాస్ వేరొకరిని హౌజ్ నుంచి పంపుతున్నారు. దాంతో ఓటింగ్ కంటే రేటింగ్ ముఖ్యమా అన్న చర్చ కూడా వస్తోందిట.
ఈ వారం దెఫినిట్ గా మోనాల్ గజ్జర్ హౌజ్ నుంచి అవుట్ అని అంతా భావిస్తే దివిని బయటకు పంపేశారు. దీని మీద అపుడే విమర్శలు మొదలయ్యాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇక 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టించుకుని గత వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఈ వారం కచ్చితంగా ఆయన నామినేషన్ లోకి వస్తారు. ఆయన్నే ఈ వారం ఇంటికి పంపుతారు అన్న టాక్ అయితే వచ్చేసింది.
అంటే బిగ్ బాస్ లో ఇపుడు నాలుగు జంటలు ఉన్నాయి. నోయల్. లాస్యను పక్కన పెడితే వీరి నుంచే లవ్ ట్రాక్ నడిపించి కావాల్సిన మసాలా రాబట్టాలని బిగ్ బాస్ ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ మార్క్ షో ఈ సీజన్ లో కనిపిస్తోందని అంటున్నారు.