మహేష్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్న త్రివిక్రమ్ ....??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో మొదట వచ్చిన అతడు సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోగా ఆపై తెరకెక్కిన ఖలేజా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన సినిమా అతడు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో నటించడం జరిగింది.

త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. వెండితెర తో పాటు ఇటు టెలివిజన్ తెరపై కూడా మంచి రేటింగ్స్ తో ఇప్పటికి కూడా మంచి క్రేజ్ తో కొనసాగుతోంది అతడు సినిమా. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఖలేజ సినిమాలో మహేష్ బాబు ఒక టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. అలానే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించడం జరిగింది. అయితే మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పేయిల్ అవ్వడం, అలానే అప్పటి నుండి ఇప్పటి వరకు మరొకసారి మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మరొక సినిమా రానేలేదు. ఇకపోతే అతి త్వరలో తామిద్దరం కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మహేష్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయనున్న త్రివిక్రమ్, ఆ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అనేటువంటి టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారని అలానే తదుపరి మహేష్ తో చేయనున్న సినిమాకు సంబంధించి కూడా అ అనే అక్షరం తోనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాతో పాటు మహేష్ బాబు సినిమాకు సంబంధించి కూడా పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసిన త్రివిక్రం వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: