జనసేన ను తెలివిగా వాడుకుంటున్న సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja

మెగా యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కొనసాగిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా తన మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ల స్మరణ చేస్తూ మెగా అభిమానుల మెప్పును పొందాలని సాయి ధరమ్ తేజ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ‘ప్రతిరోజు పండగే’ మూవీ సూపర్ హిట్ తో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో ఒక పొలిటికల్ మూవీని చేస్తున్నాడు.

‘రిపబ్లిక్’ అనే టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ కథ అంతా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో తేజ్ చెప్పే డైలాగులు అన్నీ పవన్ కళ్యాణ్ స్పీచ్ లలో చెప్పే డైలాగ్స్ లా ఉంటాయని అంటున్నారు. గతంలో దేవకట్ట తీసిన ‘ప్రస్తానం’ మూవీలా ఈమూవీ కథ చాల పవర్ ఫుల్ అని అంటున్నారు. ఈమూవీలోని సాయి తేజ్ పాత్ర పవన్ పార్టీ ‘జనసేన’ సిద్ధాంతాలను పోలి ఉండటమే కాకుండా సాయి తేజ్ గెటప్ కూడ చాల సింపుల్ గా ఒక లాల్చీ పైజమా తో కనిపిస్తూ పవన్ కళ్యాణ్ లుక్ ను గుర్తుకు చేస్తుంది అని అంటున్నారు.

సాయి తేజ్ కు చిరంజీవి సూపర్ సాంగ్స్ ను తన సినిమాలలో రీ మిక్స్ చేసి వాడుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఏకంగా ఈ మెగా మేనల్లుడు ‘జనసేన’ పార్టీ సిద్ధాంతాలను ప్రమోట్ చేసే హీరోగా రిపబ్లిక్ మూవీలో కనిపిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు చాల సులువుగా ఈ మెగా మేనల్లుడుకి కనెక్ట్ అవుతారు.

ప్రస్తుతం సాయి తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ధియేటర్లు ఓపెన్ అవ్వడం ఇంకా ఆలస్యం అయితే ఈమూవీని ఓ టీటీ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ‘రిపబ్లిక్’ మూవీ హిట్ అయితే ఈ యంగ్ హీరో మెగా అభిమానులలో తన స్థానాన్ని పూర్తిగా సుస్థిరం చేసుకోగలుగుతాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: