బాలయ్య - బోయపాటి సినిమాని భారీ రేట్ కి కొనేసిన జెమినీ..
ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్స్ కూడా సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడవ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అన్ని సినిమాల లానే కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బిబి3 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవుతోందని బోయపాటి శ్రీను తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు కూడా.
అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అప్పుడే అమ్ముడయిపోయాయని అంటున్నారు. అది కూడా భారీ రేట్ పెట్టి కొన్నరని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాని ఏకంగా పదకొండున్నర కోట్లకి కొన్నదట జెమినీ యాజమాన్యం. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్రని కుర్ర ఎమ్మెల్యేగా చూపించనున్నారని అంటున్నారు.