ఈ జనరేషన్ హీరోయిన్లలో పల్లెటూరి క్యారెక్టర్ చేయాలంటే చాలామందికి కష్టంతో కూడుకున్న పని. అలాంటిది రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా
సమంత పర్ఫెక్ట్ గా సూటయ్యింది. రామలక్ష్మి పాత్రలో
సమంత మినహా ఇంకెవర్నీ ఊహించుకోలేం. రంగస్థలంలో
రామ్ చరణ్,
సమంత జంట అందర్నీ ఆకట్టుకుంది.
ఇప్పుడు
అల్లు అర్జున్ నుంచి అలాంటి
మాస్ ఎంటర్టైనర్ రాబోతోంది. లారి
డ్రైవర్ పుష్పగా
అల్లు అర్జున్ సుకుమార్ తో ఓ
సినిమా చేస్తున్నాడు. పుష్ప మూవీలో రష్మికది కూడా పల్లెటూరి పాత్రే. లారి
డ్రైవర్ పుష్పని ప్రేమించే ఓ గిరిజన యువతిగా
రష్మిక ఇందులో నటిస్తోంది. త్వరలో షూటింగ్ మొదలు కాబోతున్న పుష్ప మూవీలో.. పల్లెటూరి అమ్మాయిగా కనిపించేందుకు
రష్మిక బాగానే ప్రిపేర్ అవుతోందట.
అల్లు
అర్జున్ -
సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్
మూవీ పుష్పపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ
మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లోనే జరుగుతుంది.
బన్నీ లారీ
డ్రైవర్ గా మొరటు పాత్రలో కనిపించబోతున్నాడు. మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న
బన్నీ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. పుష్ప
రాజ్ కి తగ్గట్టే
రష్మిక పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. గిరిజన యువతిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడే ఈ పాత్రకి
రష్మిక నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తుందని అంటున్నాడు దర్శకుడు సుకుమార్. తన సినిమాల్లో
హీరోయిన్స్ కి మంచి ప్రాధాన్యం ఉండే రోల్స్ క్రియేట్ చేసే సుక్కు.. 'పుష్ప' లో
రష్మిక కి గుర్తిండిపోయే పాత్ర ఇచ్చాడని తెలుస్తోంది. 'రంగస్థలం' లో సమంతకి రామలక్ష్మిలా.. ఇది
రష్మిక కు పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు.
అప్పుడు బావ
రామ్ చరణ్ కి
సమంత, ఇప్పుడు బామ్మర్ది
అల్లు అర్జున్ కి
రష్మిక బాగా సెట్ అయ్యారని, ఈ సినిమాతో అల్లు అర్జున్-రష్మిక జోడీకి మంచి పేరొస్తుందని
టాలీవుడ్ వర్గాలంటున్నాయి. 'పుష్ప' షూటింగ్
నవంబర్ 6 నుంచి
వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగబోతోంది.