మహేష్ మీసం కష్టాల గురించి కామెంట్స్ చేసిన నమ్రత...
మళ్ళీ ఈ మధ్య టీవీల్లో టెలికాస్ట్ అయిన ఫ్లిప్ కార్ట్ యాడ్ లో మీసంతో అలాగే పంచెకట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు మహేష్. మహేష్ కొత్త లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ కృత్రిమంగానే మీసంతో కనిపించాడని చాలా మందికి తెలుసు. అయితే ఆ లుక్ మాత్రం మహేష్ కు బాగానే ఒప్పింది. మీసంతో కనిపించడానికి మహేష్ పడిన కష్టాలను ఆయన భార్య నమ్రత తెలియజేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేసింది.
ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోని షేర్ చేస్తూ..“ఆర్టిఫిషియల్ గా అమర్చేవి … జెన్యూన్ గా అనిపించవు. కానీ షూటింగ్ కోసం కొన్ని ఆర్టిఫిషియల్ పద్దతులను పాటించాల్సి వస్తుంటుంది. అది అంత ఈజీ కాదు కానీ… వాటిని మేనేజ్ చేసే నిపుణులు ఉన్నప్పుడు అలాంటి ఛాలెంజెస్ ను ఇష్టపడనివారుండరు’ అంటూ పేర్కొంది నమ్రత.
https://www.instagram.com/p/CG4TCndjjhr/?igshid=1nvizrkqfs9jk
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో త్రివిక్రమ్ దర్శకత్వంలోను సినిమా చేస్తున్నాడు. ఇక దాని తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.