తమ్ముడికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

Chaganti
మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు, నటుడు, నిర్మాత అయిన నాగబాబు నిన్న పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సీనీ ప్రముఖులు బర్త్‌డే విషెష్‌ తెలియచేశారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమ్ముడి బర్త్ డే వేడుకలు దగ్గరుండి చేయించి షాక్ ఇచ్చాడు చిరంజీవి. నిజానికి నాగబాబు - బాలకృష్ణ మాటల యుద్ధం సమయంలో ఇంకేముంది చిరంజీవి నాగబాబుని పక్కన పెట్టేశాడని ప్రచారం జరిగింది. నిన్నటి దెబ్బకు ఆ పుకార్లకి బ్రేక్ వేసినట్టు అయింది. అయితే తమ్ముడికి తాను బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడట చిరంజీవి.
నిన్న స్వయంగా పుట్టినరోజు వేడుకలకి వెళ్ళిన ఆయన తమ్ముడికి గిఫ్ట్ ఇస్తున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటి ? అనుకుంటున్నారా ? అదేనండీ నాగబాబుకి అంజనా ప్రొడక్షన్స్ అనే ఒక నిర్మాణ సంస్థ ఉంది. ఆ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని చిరు నిన్న హామీ ఇచ్చారట. నిజానికి ఆరెంజ్ దెబ్బకు నాగబాబు మళ్ళీ నిర్మాణం జోలికే పోలేదు. అయితే అన్నయ్య స్వయంగా సినిమా చేస్తానని చెప్పడంతో ఆయన ఇప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడట. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే నటిగా రాణించలేక పోయి పెళ్లి చేసేసుకుంటున్న నాగబాబు కుమార్తె నిహారిక  ఇకపై అంజనా ప్రొడక్షన్స్‌ వ్యవహారాలు చూసుకోనుందని అంటున్నారు.
 ఇక త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.  అంతే కాదు అంజనా ప్రొడక్షన్‌ సింగిల్ గా ఆ సినిమా ప్రొడ్యూస్ చేయదని దానికి తోడుగా మరో బ్యానర్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలు ఆయన బిజీగా ఉండడంతో ఆ పనులు అన్నీ అక్క సుష్మిత చూసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: